ఆదివాసి గ్రామంలో వైద్య శిబిరం
BDK: మణుగూరు పరిధిలో గల వలస ఆదివాసి గిరిజన గ్రామమైన పెద్దపల్లిలో వైద్యులు ఇవాళ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గృహ సందర్శన చేసి జ్వర సర్వే చేసి గర్భిణీ స్త్రీలను గుర్తించడం జరిగింది. అనంతరం పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని సూచించారు.