ట్రంప్ సన్నిహితుడు చార్లీ హత్య కేసు.. షూటర్ అరెస్టు!

ట్రంప్ సన్నిహితుడు చార్లీ హత్య కేసు.. షూటర్ అరెస్టు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు చార్లీ కర్క్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. చార్లీని తుపాకీతో కాల్చినట్లు భావిస్తున్న ఓ అనుమానితుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. నిందితుడిని యూటాకు చెందిన 22 ఏళ్ళ టైలర్ రాబిన్‌సన్‌గా గుర్తించారు. చార్లీ కర్క్‌పై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే.