విద్యతో పాటు క్రీడలు ముఖ్యమే: ఎమ్మెల్యే అంజిబాబు

విద్యతో పాటు క్రీడలు ముఖ్యమే: ఎమ్మెల్యే అంజిబాబు

W.G: విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. శుక్రవారం వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ పోటీలను జ్యోతిని వెలిగించి ఆయన ప్రారంభించారు. 13 జిల్లాల్లోని 468 మంది క్రీడాకారులు పోటీలకు హాజరు కావడం ఆనందదాయకమన్నారు.