చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

MNCL: మంచిర్యాలలోని జ్యోతి నగర్‌లో ఇందారపు రాజయ్య నివాసంలో గత నెల 13న చోరీకి పాల్పడిన నిందితుడు కలవేన వసంత్‌ను అరెస్ట్ చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు గురువారం తెలిపారు. చోరీ చేసిన సొత్తు బంగారు షాపులలో అమ్మడానికి వెళుతుండగా అరెస్ట్ చేసి 19.37 గ్రాముల బంగారు పుస్తెల తాడు, యమహా బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.