మండల పరిషత్ కార్యాలయ భవనానికి నిధులు మంజూరు

BHPL: పలిమెల మండల పరిషత్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.1.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మంజూరుకు కృషి చేసిన మంత్రి సీతక్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పలిమెల మండలం ఉన్నప్పటికీ, ప్రస్తుతం అన్ని కార్యాలయ కార్యకలాపాలు మహాదేవపూర్‌లో నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.