పెచ్చులుడుతున్న పాఠశాల పై కప్పు

పెచ్చులుడుతున్న పాఠశాల పై కప్పు

RR: కొందుర్గు మండల పరిధిలోని కొత్త ఆగిరాల ప్రాథమిక పాఠశాలలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి పెచ్చులూడాయి. దీంతో పాఠశాలలో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో విద్యార్థులు ఉన్న సందర్భంలో పెచ్చులూడితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాల భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు.