హోంగార్డులలో ఉత్సాహం నింపిన క్రీడా స్ఫూర్తి
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు,హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పోలీసు పరేడ్ మైదానంలో హోంగార్డులకు ఆటల పోటీలు ఉల్లాసంగా నిర్వహించారు.100 మీ.పరుగు,షాట్ ఫుట్,వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడల్లో పెద్ద సంఖ్యలో హోంగార్డులు పాల్గొని తమ శారీరక దారుఢ్యాన్ని, సమిష్టి స్ఫూర్తిని ప్రదర్శించారు.