గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్.. 114 పాస్‌పోర్టులు స్వాధీనం

గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్.. 114 పాస్‌పోర్టులు స్వాధీనం

జగిత్యాల పట్టణంలో కన్సల్టెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గల్ఫ్ ఏజెంట్ కాముని గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 114 పాస్‌పోర్టులు, ల్యాప్‌ట్యాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు DSP రఘు చందర్ వెల్లడించారు. పెంబట్లకు చెందిన గంగాధర్ అమాయకులను నమ్మించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారం మేరకు నిందితుడిని అరెస్ట్ చేసారు.