VIDEO: 'వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి'
GNTR: గుంటూరు కలెక్టరేట్ వద్ద AIYF జిల్లా కమిటీ మంగళవారం నిరసన చేపట్టింది. AIYF జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ మాట్లాడుతూ.. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని కోరారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు, లోకేశ్ విఫలమయ్యారన్నారు.