గుత్తి కో-ఆపరేటివ్ ఐదో బ్రాంచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ
ATP: గుంతకల్లులో ది గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 5వ బ్రాంచ్‌ను సోమవారం ఎమ్మెల్యే జయరాం, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తక్కువ వడ్డీతో రుణాలు, మెరుగైన సేవలు అందించే ఈ బ్యాంక్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. చరిత్ర కలిగిన గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఐదో బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.