జిల్లాలో గంట వ్యవధిలో అన్నదమ్ములు మృతి

KRNL: హొళగుందలో అన్నదమ్ములైన చెన్నబసప్ప (78), భద్రప్ప (75)ల మరణం చోటుచేసుకుంది. ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతూ, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున అన్న చెన్నబసప్ప మరణించగా, ఆయన మరణ వార్త తెలుసుకున్న తమ్ముడు భద్రప్ప కూడా కొద్ది వ్యవధిలోనే తుదిశ్వాస విడిచారు. వారిద్దరు కష్టసుఖాలను పంచుకుంటూ తోడుగా జీవించారని కుటుంబ సభ్యులు తెలిపారు.