రైలు కింద పడి యువకుడు మృతి

రైలు కింద పడి యువకుడు మృతి

VZM: బొబ్బిలి పట్టణం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని రైల్వే గేట్ వద్ద ఇవాళ మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. వందే భారత్ రైలు కింద పడి ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. స్థానికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.