స్కూల్ విద్యార్థులకు తప్పిన ప్రమాదం
KMM: మధిర మండలం ఆత్కూరు సమీపంలో బుధవారం ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. పిల్లలతో వస్తున్న ఓ ప్రవేట్ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును ఆపి విద్యార్థులను కిందకు దింపారు. అనంతరం ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చి, మంటలను ఆర్పి వేశారు.