కిచ్చా సుదీప్ 'మార్క్' టీజర్ విడుదల
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'మార్క్'. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్యాన్ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా, మేకర్స్ ఈ సినిమా నుంచి సుదీప్ ఎంట్రీ టీజర్‌ను విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హీరో నవీన్ చంద్ర కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.