ఆసుపత్రిలో నూతన ఎక్స్‌రే మిషన్ ప్రారంభం
KRNL: ఆదోని పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఉన్న టీబీ యూనిట్‌లో కొత్తగా హ్యాండ్ హ్యాండిల్ ఎక్స్‌రే మిషన్‌ను ఇవాళ ప్రారంభించారు. అమరావతి నగర్ ప్రాంతంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0ను నిర్మించారు. జిల్లా కోఆర్డినేటర్ ఉమాపతి మాట్లాడుతూ.. పీఎం టీబీఎంబీఏ ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ ఉచితంగానే ఎక్స్‌రేలు తీసుకునేందుకు ముందుకు రావాలని అన్నారు.