రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం: సాల్మన్ రాజ్

రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం: సాల్మన్ రాజ్

ఏలూరు జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటివరకు 1,00,026 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 31,022 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను గ్రిడ్ అనుసంధానించినట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాల్మన్ రాజు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో 4,218 మంది వినియోగదారులు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారన్నారు.