భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం

MNCL: లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాలలో కురిసిన వర్షాలకు రైతుల పొలాల్లో వేసిన వివిధ పంటలు మునిగిపోయాయి. గడిచిన 24 గంటలుగా మండలంలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో ఉన్న చెరువు నీరు పొలాల్లో ప్రవేశించి పంటలను ముంచివేసింది. వరి, పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.