ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బర్రెలక్క
NGKL: లింగాల మండలం కొత్తకుంటపల్లి గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి యాట ఆంజనేయులుకు మద్దతుగా బర్రెలక్క (శిరీష) ప్రచారం నిర్వహించారు. సోమవారం ఆమె గ్రామంలో పర్యటించి, ఆంజనేయులు గెలుపు కోసం ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో వార్డు సభ్యుల అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.