భారత్‌కు మరో 16,714 టన్నుల ఎల్పీజీ

భారత్‌కు మరో 16,714 టన్నుల ఎల్పీజీ

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరటనిస్తూ మరో భారీ ఎల్పీజీ కార్గో షిప్ 'పైక్సిస్ పయనీర్' న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. అమెరికాలోని టెక్సాస్ ఉంచి ఫిబ్రవరి 14న బయల్దేరిన ఈ నౌక ద్వారా ఏజిస్ లాజిస్టిక్స్ సంస్థ 16,714 టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంది. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుండటం గమనార్హం.