'అభివృద్ధి నిధులతో సమస్యను పరిష్కరించాలి'
అన్నమయ్య: తంబళ్లపల్లె MPDO కార్యాలయం ఎదుట తేలికపాటి వర్షాలకే కుంటను తలపిస్తుంది. కార్యాలయం లోపలికి వెళ్లడానికి అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు పట్టించుకోకపోవడం విచారకరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల అభివృద్ధి నిధులతో ఈ సమస్యను పరిష్కరించాలని అధికార పార్టీనాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు.