ఇచ్చిన మాట నిలుపుకున్న సర్పంచ్

ఇచ్చిన మాట నిలుపుకున్న సర్పంచ్

SRCL: తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లిలో సర్పంచ్ చెక్కపల్లి శరణ్య తన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. గ్రామంలోని వేల్పుల శ్రీనివాస్ - తులసవ్వ దంపతుల కుమార్తె వాణి వివాహం సందర్భంగా రూ. 5,016 నగదును పెళ్లి కానుకగా అందజేశారు. అనంతరం గ్రామంలోని లబ్ధిదారులు బాల్ రెడ్డి, సంధ్య, భూమయ్యలకు కలిపి మొత్తం రూ. 1,51,000 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు.