డిమాండ్ లేక రోడ్డుపై పారబోస్తున్న బంతిపూలు
RR: ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్లలో రైతులు బంతిపూలను రోడ్లపై పారబోశారు. పండుగల సీజన్ కాకపోవడం, మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోవడం వల్ల బంతిపూలకు ధరలు పూర్తిగా పడిపోయాయని చివరకు రోడ్లపై పారబోసి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీస మద్దతు ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు.