గద్దె రాళ్ళ తిమ్మప్ప స్వామికి జాహ్ను సప్తమి పూజలు

గద్దె రాళ్ళ తిమ్మప్ప స్వామికి  జాహ్ను సప్తమి పూజలు

ATP: గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో గుట్టపై వెలసిన శ్రీ శ్రీ మహాలక్ష్మి సమేత గద్దెరాళ్ల తిమ్మప్ప స్వామి ఆలయంలో ఆదివారం జాహ్ను సప్తమి సందర్భంగా వేకువజామున స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, తులసి మాలతో అలంకరించి పానకం వడపప్పు నివేదించారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు.