నిజాయితీ గల నాయకుడికే పట్టం కట్టాలి

విజయనగరం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడే నిజాయితీ గల నాయకుడికే పట్టం కట్టాలని గజపతినగరం నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు పిలుపునిచ్చారు. గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం గ్రామంలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కలిగించారు.