జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిపై CM చంద్రబాబు ఆరా
NTR: జోగి రమేష్ ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనపై CM చంద్రబాబు ఆరా తీశారు. మైలవరం TDP నాయకులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు CMకు తెలిపారు. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, ఉద్రిక్తతలకు దారితీసే చర్యలను సహించబోమని CM హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని, చట్టం ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.