పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
PDPL: కమాన్పూర్ మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్ పెద్దపల్లి మండలం సబ్బితం శివారులో నిన్న సాయంత్రం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కళ్ళ ముందే తిరుగుతూ ఉండే దేవేందర్ విగతజీవిగా మారడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.