ప్రజా పోరాటాల్లో భూపాల్ రెడ్డి సేవలు మరువలేనివి: ఎమ్మెల్సీ
BHNG: చౌటుప్పల్ మాజీ సర్పంచ్, సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి వర్గ సభ్యుడు చింతల భూపాల్ రెడ్డి మరణం కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ప్రజా పోరాటాలకు తీరని లోటని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మంగళవారం స్థానిక పట్టణ కేంద్రంలోని చింతల భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.