తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
AP: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా.. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల వేంకటేశ్వరుడిని 68,615 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.23 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.