ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
NDL: నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ రాజకుమారి వర్షాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27, 28, 29, తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. అధికారులు వర్షాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.