CMRF చెక్కులు పంపిణీ చేసిన TDP రాష్ట్ర కార్యదర్శి
VZM: ఆపదలో ఉన్న పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు స్పష్టం చేసారు. సోమవారం గరివిడిలో CMRF కింద మంజూరైన సుమారు రూ.19.13 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.