విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన కలెక్టర్
WGL: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల బయోమెట్రిక్ తప్పనిసరిగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సత్యశారద శుక్రవారం ఆదేశించారు. ఈ మేరకు ఆమె కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. KGBV, TGMS పాఠశాలల్లో ప్రవేశాలు పూర్తి చేయాలన్నారు. ఇంటర్నెట్ సదుపాయాలు మెరుగుపర్చేందుకు BSNL ఫైబర్ సర్వీస్ ప్రొవై డర్త్‌తో సమన్వయం కల్పించాలన్నారు.