VIDEO: HIT TV కథనానికి స్పందన
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక డా.అంబేడ్కర్ నగరులో గత నెల నుంచి వీధిదీపాలు వెలగకపోవడంపై 'అంధకారంలో డా.అంబేడ్కర్ నగర్' శీర్షికతో HIT TVలో కథనం ప్రచురితమైంది. దీంతో ఆదివారం స్పందించిన పంచాయతీ కార్యదర్శి కుమ్ర మోతిరాం విద్యుత్తు బల్బులకు మరమ్మతులు చేసి పున:ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రజలు HIT TV, కార్యదర్శికి కృతజ్ఞతలు తెలియజేశారు.