VIDEO: అగ్ని ప్రమాదం.. తీవ్ర ఆస్తి నష్టం..!
అన్నమయ్య: పుంగనూరు మండలం హనుమంతరాయని దిన్నె వద్ద శుక్రవారం సాయంత్రం మామిడి తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీమతి డి. నారాయని భర్త పి.ఆర్. రాజేష్‌కు చెందిన తోటలో మంటలు చెలరేగడంతో సుమారు రూ. 25,000 మేర నష్టం జరిగినట్లు తెలిపారు. గుర్తు తెలియని యువకులు ధూమపానం చేసి ఆర్పకుండా పారవేయడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.