అక్రమ ఇసుక రవాణా.. పదిమంది బైండోవర్

అక్రమ ఇసుక రవాణా.. పదిమంది బైండోవర్

KNR: కరీంనగర్ రూరల్ పరిధిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేశారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కరు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.