వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్‌కు IAF నివాళి

వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్‌కు IAF నివాళి

దుబాయ్ ఎయిర్‌ షోలో తేజస్ విమానం కూలి మరణించిన వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్‌కు భారత వాయుసేన(IAF) నివాళులర్పించింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. నమాన్ష్ వృత్తిపట్ల అంకితభావం, అసాధారణ ప్రజ్ఞాశీలి అని IAF కొనియాడింది. తన జీవితాన్ని దేశ సేవకు అంకితమిచ్చారని పేర్కొంది. ఈ బాధాకర సమయంలో ఆయన కుటుంబానికి IAF అండగా ఉంటుందని తెలిపింది.