నకరికల్లు హోమియో వైద్యశాల మార్పు

నకరికల్లు హోమియో వైద్యశాల మార్పు

PLD: నకరికల్లు గ్రామంలోని హోమియో వైద్యశాలను పంచాయతీ కార్యాలయానికి మార్చినట్లు గురువారం డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె చెప్పారు. కొత్త ప్రాంగణంలో హోమియో వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఇక్కడ పక్షవాతం, స్త్రీల సమస్యలు, కీళ్ల వాతం వంటి వాటికి ఉచిత చికిత్స అందిస్తామన్నారు.