'అఖండ 2' ఎఫెక్ట్.. వాయిదా పడిన మరో చిత్రం
ఇటీవల వాయిదా పడిన బాలకృష్ణ 'అఖండ 2' డిసెంబరు 12న బాక్సాఫీస్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నందు ప్రధానపాత్రలో నటించిన 'సైక్ సిద్ధార్థ్' సినిమా వాయిదా పడింది. డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. జనవరి 1కి విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. అలాగే, ఈనెల 12న విడుదలయ్యేందుకు సిద్ధమైన పలు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది.