VIDEO: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్
HYD: ప్రముఖ జర్నలిస్ట్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఇవాళ ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఫీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎంక్లేవ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఏ కారణంతో ఈ చర్య తీసుకున్నారనేది పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఆకస్మిక అరెస్ట్‌పై బీసీ సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.