రేపటి నుంచి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు
NZB: తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి సీనియర్ పురుషులు, మహిళల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలను నిర్వహించనున్నారు. HYD సుల్తాన్ సాయి ప్లే గ్రౌండ్‌లో ఓపెన్ క్యాటగిరిలో నిర్వహిస్తామని NZB రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలన్నారు.