వాకర్స్ అసోసియేషన్ భోగి పండుగ వేడుకలు

వాకర్స్ అసోసియేషన్ భోగి పండుగ వేడుకలు

మేడ్చల్: ఉప్పల్ మున్సిపల్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు వాకర్ సభ్యులు భోగిమంటలు వేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అసోసియేషన్ ప్రతినిధులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.