'మనులో యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి'
HYD: మను (MANU) యూనివర్సిటీ విద్యార్థులు స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగించారు. ఒకటిన్నర సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడంతో విద్యార్థుల హక్కులు కాలరాయ బడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే స్పందించి ఎన్నికలు పునరుద్ధరించాలన్నారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు నిన్న డిమాండ్ చేశారు.