జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

KMM: రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో టీజీఐఐసీకి కేటాయించిన భూములను కలెక్టర్ అనుదీప్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలత, మౌళిక వసతుల లభ్యతపై అధికారులతో చర్చించారు. భూముల సరిహద్దులను మ్యాప్‌ల ఆధారంగా సర్వే చేసి కేటాయించాలని ఆదేశించి, ఖమ్మం జిల్లాను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.