పోలీస్ ఓపెన్ హౌస్‌ను ప్రారంభించిన ఎస్పీ

పోలీస్ ఓపెన్ హౌస్‌ను ప్రారంభించిన ఎస్పీ

ELR: ఎస్పీ కార్యాలయ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీస్ హౌస్ ప్రారంభించామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. పోలీసులు నిర్వహించే విధులు, వారు వినియోగించే ఆయుధాలు, వాహనాల వివరాలు, విద్యార్థి స్థాయి నుంచే తెలియజేయడం ద్వారా పోలీసు విధులు విద్యార్థులకు అవగతం అవుతాయన్నారు. పోలీసు జాగిలాల ఉపయోగాన్ని తెలిపారు.