VIDEO: 'సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి'
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఉగాది పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ పూజారి యాయవరం శ్రీధర్ శర్మ పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపంటలకు కొదువ ఉండదని పేర్కొన్నారు. చెడ్డవారి పతనం ఈ సంవత్సరంలో మెండుగా ఉంటుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉపసర్పంచ్ స్వామి పాల్గొన్నారు.