కొడుకుపై తల్లి ఫిర్యాదు
KNR: కన్నకొడుకు వేదింపులు భరించ లేక ఓ వృద్ధ తల్లి ఇవాళ పోలీసులను ఆశ్రయించిన ఘటన హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అజ్మత్ బీ అనే వృద్దురాలిని తన కొడుకు పెన్షన్ డబ్బుల కోసం ప్రతి రోజూ వేధిస్తున్నాడని వాపోయింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించి ఈ పెన్షన్ తనకు జీవనోపాధని, తనను రక్షించాలని వారిని కోరింది.