ఈనెల 8,9 తేదీల్లో గ్లోబల్ సదస్సు: భట్టి
TG: ఈనెల 8,9 తేదీల్లో గ్లోబల్ సదస్సు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రెండేళ్ల పాలనలో ఏం చేశామో ఈనెల 8న సదస్సులో చెబుతామని వెల్లడించారు. భవిష్యత్‌లో ఏం చేయబోతున్నామో ఈనెల 9న వివరిస్తామని చెప్పారు. ఈనెల 9వ తేదీన విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని ప్రకటించారు. తెలంగాణ విజన్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరిస్తామన్నారు.