VIDEO: 'మెడికల్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి'
SKLM: ఆమదాలవలస మండలంలోని అక్కులపేట, దూసి, తొగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. మెడికల్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య అధికారులకు సూచించారు.