క్షయ నిర్మూలనలో జగిత్యాలకి రెండో స్థానం

క్షయ నిర్మూలనలో జగిత్యాలకి రెండో స్థానం

JGL: క్షయ వ్యాధి నిర్మూలనలో జగిత్యాల జిల్లా రెండో స్థానం సాధించిందని జిల్లా వైద్యాధికారి డా. జీ సుజాత తెలిపారు. జిల్లా క్షయ నివారణ అధికారి డా.ఎన్ శ్రీనివాస్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగే వరల్డ్ టీబీ డే వేడుకల్లో జిల్లాకు ఉత్తమ పురస్కారం అందనున్నట్లు చెప్పారు. ఈ విజయానికి కృషి చేసిన వైద్య సిబ్బందిని అభినందించారు.