మాజీ మేయర్ హైకోర్టులో చుక్కెదురు

మాజీ మేయర్ హైకోర్టులో చుక్కెదురు

AP: కడప మాజీ మేయర్ సురేష్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. కడప మేయర్ ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సురేష్‌ బాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మేయర్‌గా తనను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధమన్నారు. తాజాగా ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.