బిర్యానీ ప్రయాణం.. బలి తీసుకున్న ప్రమాదం

బిర్యానీ ప్రయాణం.. బలి తీసుకున్న ప్రమాదం

కృష్ణా: బిర్యానీ తినడానికి వెళ్లిన ప్రయాణం రెండు యువజీవితాలను బలి తీసుకుంది. నిన్న అర్ధరాత్రి మోపిదేవి పరిధిలోని టోల్ ప్లాజా దాటి వస్తుండగా కంటైనర్ బైక్‌ను ఢీకొట్టింది. అవనిగడ్డకు చెందిన భాస్కర్, సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.